నిర్భయ తరహా సామూహిక అత్యాచార ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతి బట్టలు చించేసి అఘాయిత్యానికి పాల్పడిన వీడియో ఒకటి బుధ, గురు వారాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై కేఎస్‌యూ ఢిల్లీ విభాగం హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాసింది. ఆ వెంటనే కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు, ఐపీఎస్ అధికారి రాబిన్ హిబు, మేఘాలయా ఎమ్మెల్యే అంపరీన్ రంగంలోకి దిగారు. ఎట్టకేలకు వీడియోలో ఉన్న ఐదుగురు నిందుతులను బెంగళూరులో అరెస్ట్ చేశారు.
ఆ వీడియోలోని నిందితులను రామమూర్తి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరి ఫేస్బుక్ ఫ్రొఫైల్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకోగలిగామని రామమూర్తి నగర్ స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ అమానుష ఘటనలో మొత్తం ఆరుగురు ఉన్నారని.. లైంగిక దాడి కేసులో వాళ్లను అరెస్ట్ చేశామని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు.
22 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు పాశవికంగా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. మరో దురదృష్టకర పరిణామం ఏంటంటే.. ఆ నలుగురి యువకులు గ్యాంగ్‌రేప్ చేస్తున్న సమయంలో ఓ యువతి వారికి సహకరించింది. ఆ నలుగురు యువకులు, ఆ యువతి బంగ్లాదేశ్ నుంచి బెంగళూరు వచ్చి అక్రమంగా నివాసముంటున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది.