ఇద్దరు అబ్బాయిలతో బాలిక ప్రేమ వ్యవహారం.. ఒకరికి తెలియకుండా ఒకరితో.. చివరికి ఏమైందంటే?

No, Rahul Gandhi did not refuse to perform aarti; viral claim is false. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో ఓ మైనర్ బాలిక ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే మొదటి

By అంజి  Published on  29 Sept 2022 7:00 PM IST
ఇద్దరు అబ్బాయిలతో బాలిక ప్రేమ వ్యవహారం.. ఒకరికి తెలియకుండా ఒకరితో.. చివరికి ఏమైందంటే?

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో ఓ మైనర్ బాలిక ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే మొదటి ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో రెండో ప్రియుడు వారిని పట్టుకొని, తుపాకీతో కాల్చి తీవ్రంగా గాయపరిచాడు. బుధవారం సాయంత్రం గోపాల్‌పూర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో కాల్పులు జరగడం ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. బుల్లెట్ల శబ్ధం విని చుట్టుపక్కల ఘటనా స్థలంలో గుమిగూడారు. బాలిక ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఎఫైర్‌ పెట్టుకుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని చూడగా 20 ఏళ్ల యువకుడు రక్తంతో పడి ఉన్నాడు.

అతని పక్కనే నిలబడి ఉన్న 13 ఏళ్ల బాలిక గట్టిగా అరుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని, ఆమె ప్రియుడు అంకిత్ బర్మన్ బాలిక ఇంటికి వచ్చాడని స్థానికులు తెలిపారు. ఈ విషయం బాలిక రెండో ప్రియుడు ఉజ్వల్‌కు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయి పిస్టల్‌తో బాలిక ఇంటికి చేరుకున్నాడు. అంకిత్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. అంకిత్ చెంపలోంచి బుల్లెట్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు దుర్గాపూర్ మిషన్ ఆస్పత్రికి తరలించారు.

అదే సమయంలో.. ఈ సంఘటనతో స్థానిక ప్రజలు పెద్ద దుమారం సృష్టించారు. బాలికను, ఆమె తల్లిని అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. పోలీసులు తల్లీ కూతుళ్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు ఉజ్వల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన తర్వాత ఉజ్వల్ పరారీలో ఉన్నాడు, అతని కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Next Story