Nizamabad: పండగపూట విషాదం.. తండ్రీకొడుకు మృతి

నిజామాబాద్‌ జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 1:30 PM IST
Nizamabad, road accident, father,  son, death ,

 Nizamabad: పండగపూట విషాదం.. తండ్రీకొడుకు మృతి 

నిజామాబాద్‌ జిల్లాలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌ గ్రామం దగ్గర జరిగింది. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

మోర్తాడ్‌ మండలం దొనకల్‌ గ్రామానికి చెందిన మారవీటి రవీందర్ (55), మారవీటి శివరాజ్ (24) బైక్‌పై ఆర్మూరు వైపు బయల్దేరారు. పడగల్‌ గ్రామంలోకి రాగానే ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని గమనించకుండా వేగంగా దూసుకెళ్లారు. దాంతో.. లారీని ఢీకొట్టి తీవ్రగాయాల పాలయ్యారు. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే తండ్రి, కొడుకులు ప్రాణాలు కోల్పోయారు. కాగా... అనారోగ్యంతో ఉన్న తండ్రి రవీందర్‌ను కొడుకు శివరాజ్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. పండగపూట తండ్రి, కొడుకులు ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఇక రోడ్డు ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. వారు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వారి చనిపోయినట్లు గుర్తించారు. దాంతో.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అతివేగంగా వచ్చి ఆగివున్న లారీని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందిన పోలీసులు కూడా తెలిపారు.

Next Story