నిజామాబాద్ జిల్లాలో దారుణం.. పండ్ల‌ర‌సాలు కొనిస్తాన‌ని తీసుకెళ్లి 9 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం

Nine year old girl Molested in Nizamabad District.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2022 11:32 AM IST
నిజామాబాద్ జిల్లాలో దారుణం.. పండ్ల‌ర‌సాలు కొనిస్తాన‌ని తీసుకెళ్లి 9 ఏళ్ల బాలిక‌పై అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. కామంతో క‌ళ్లుమూసుకుపోయి.. చిన్నా-పెద్దా, వావి-వ‌రుస అన్న తేడాలేకుండా మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. పండ్ల ర‌సం కొనిస్తాన‌ని చెప్పి ఓ వ్య‌క్తి తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. బాధితురాలి త‌ల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం మూడు నెల‌ల కింద‌ట జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌ల కేంద్రానికి వ‌చ్చారు. శివారులో గుడిసె వేసుకుని జీవినం సాగిస్తున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం భార్య‌, కుమారైను వ‌దిలి భ‌ర్త ఎటో వెళ్లిపోయాడు. దీంతో స‌మీప గ్రామంలోని విత్త‌నోత్ప‌త్తి కేంద్రంలో కూలీగా ప‌ని చేసుకుంటూ త‌న తొమ్మిదేళ్ల కుమారైను పోషించుకుంది త‌ల్లి.

ఈ క్ర‌మంలో రోజు మాదిరిగానే శుక్ర‌వారం కుమారైను ఇంట్లో వ‌దిలి.. త‌ల్లి ప‌నికి వెళ్లింది. దీన్ని గ‌మ‌నించిన నారాయ‌ణ‌(35) అనే వ్య‌క్తి బాలిక‌కు పండ్ల ర‌సాల‌ను కొనిస్తాన‌ని చెప్పి స‌మీపంలోని కొండ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్క‌డ బాలిక‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. సాయంత్రం ఇంటికి వ‌చ్చిన త‌ల్లికి కుమారై క‌నిపించ‌క‌పోవ‌డంతో.. చుట్టుప‌క్క‌ల గాలించ‌గా.. చిన్నారితో స‌హా నిందితుడు దొరికాడు. దీనిపై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story