వికారాబాద్‌లో నవ వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులు తాళలేక..

వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి భర్త వేధింపుల కారణంగా నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

By -  అంజి
Published on : 27 Nov 2025 6:20 PM IST

Newly married woman died, suicide, Vikarabad , harassment, Crime

వికారాబాద్‌లో నవ వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులు తాళలేక..

వికారాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి భర్త వేధింపుల కారణంగా నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వంట సరిగా చేయడం లేదు అంటూ భార్యను మానసికంగా హింసించడం తో నవ వధువు ఆత్మహత్య చేసుకుందని ప్రాథమిక సమాచారం. వికారాబాద్‌లోని ధరూర్ మండలానికి చెందిన శిరీష (21) అనే మహిళకు వికారాబాద్ జిల్లా పరగి మండలానికి చెందిన శివలింగంతో ఆరు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగినప్పటి నుంచి వంట సరిగా చేయడం లేదని, తనకంటే తక్కువగా చదువుకుందని తరచూ భార్యను భర్త వేధింపులకు గురి చేశాడు.

భర్త వేధింపులతో ప్రతిరోజు భార్య శిరీష మానసిక క్షోభ అనుభవించింది. ఈ క్రమంలోనే ఇటీవల భార్య.. భర్తను ఎదురు ప్రశ్నించింది. దీంతో భార్యను ఈమధ్యే పుట్టింట్లో వదిలేసి వెళ్ళాడు భర్త శివలింగం. తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష బుధవారం తల్లిగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి శివలింగం తన భార్యను ఏదో ఒక కారణం చెప్పి వేధిస్తున్నాడని, దీంతో ఆ మహిళ నిరాశకు గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story