శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు.. తల్లి అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే.!
Newborn baby's body mauled by dogs found in Kerala. కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ ప్రాంతంలో మంగళవారం నవజాత శిశువు మృతదేహాన్ని
By అంజి Published on 30 Nov 2022 12:49 PM ISTకేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ ప్రాంతంలో మంగళవారం నవజాత శిశువు మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహానికి మూడు రోజుల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. తిరూర్ సమీపంలోని కన్మనం చెనక్కల్‌లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వీధి కుక్కలు.. ఆ శిశువు మృతదేహాన్ని చీల్చి ముక్కలు ముక్కలు చేశాయి. చెనక్కల్‌లో ఓ ఇంటి వద్ద కాకులు బిగ్గరగా అరవడాన్ని యజమాని గమనించాడు. అటుగా వెళ్లి చూసేసరికి అక్కడ ఓ శిశువు మృతదేహాం కనిపించింది. షాక్‌కు గురైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఈ ప్రాంతంలో వీధి కుక్కల బెడద కూడా తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లిదండ్రులు వదిలిపెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కల్పకంచెరి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరకు శిశువు తల్లి అయిన కన్మనం ప్రాంతానికి చెందిన ఇరింగవూరుకు చెందిన 29 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. అందర్నీ షాక్‌కి గురిచేసే విధంగా ఆ తల్లి తన బిడ్డను హత్య చేసింది. నిందితురాలు శుక్రవారం ప్రసవించిన తర్వాత పాప నోటిని కప్పి అల్మారాలో దాచిపెట్టింది.
అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని చెత్తకుండీలో మృతదేహాన్ని దహనం చేసింది. అయితే వర్షం కారణంగా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. ఆపై మృతదేహాన్ని కుక్కలు బయటకు ఈడ్చుకెళ్లాయి. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తదుపరి విచారణలో ఆ తల్లి పాత్ర ఏంటో అర్థమైంది. కాగా తల్లిని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. మొదటి బిడ్డ పుట్టడంపై గల్ఫ్‌లో ఉన్న తన భర్తతో కొనసాగుతున్న సమస్యల మధ్య మరో బిడ్డకు జన్మనిచ్చింది. కొత్త బిడ్డ విషయంలో సమస్యలు వస్తాయని బిడ్డ పుట్టిన విషయాన్ని దాచిపెట్టి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.