డిజిటల్ అరెస్టులు, పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు అంటూ చేస్తున్న మోసాల తర్వాత, ప్రజలను వంచించడానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిగా నటిస్తూ కొత్త కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. CISF సిబ్బంది లాగా నటిస్తూ మోసాలకు తెగబడుతూ ఉన్నారు. నకిలీ CISF ID కార్డును ఉపయోగిస్తూ, యూనిఫాం ధరించి ఉన్నట్లు చూపించే ఫోటోను పంచుకుంటారు.
భారతదేశం అంతటా చాలా మంది వ్యక్తులు తమ ఇల్లు లేదా ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. అటువంటి ప్లాట్‌ఫామ్‌ల నుండి, మోసగాళ్ళు ఇంటి యజమానుల సంప్రదింపు వివరాలను పొందుతారు.
వారు ఆయా వ్యక్తులను CISFలో సబ్-ఇన్‌స్పెక్టర్ లేదా కానిస్టేబుల్ గా వారిని బదిలీ చేస్తున్నారని, వారికి బస చేయడానికి ఇల్లు అవసరమని చెబుతారు. మోసగాళ్ళు నకిలీ ఆధార్, పాన్ కార్డులతో పాటు నకిలీ CISF IDని కూడా పంచుకుంటారు. అద్దె డబ్బులను బదిలీ చేసే నెపంతో ఇంటి యజమానుల బ్యాంక్ వివరాలను తీసుకుంటారు. ఆ తర్వాత కొన్ని క్షణాలలో ఇంటి యజమానుల బ్యాంకు ఖాతాల నుండి డబ్బు మాయమవుతుంది.