Hyderabad: నవ వధువు ఆత్మహత్య.. బలవంతంగా పెళ్లి చేశారని..

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపారు.

By అంజి
Published on : 11 Nov 2024 8:49 AM IST

New bride , suicide, Hyderabad city, Crime

Hyderabad: నవ వధువు ఆత్మహత్య.. బలవంతంగా పెళ్లి చేశారని..

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేశారని యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. బాధితురాలు నగరంలోని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి శ్రీదేవి అని ఇన్‌స్పెక్టర్ విజయ్ వర్ధన్ గుర్తించారు. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పేరవలి మండలం ముక్కామల గ్రామం.

శ్రీదేవికి.. వెలమెల్లికి చెందిన వంశీకృష్ణతో గత నెల 16వ తేదీన పెళ్లైంది. వీరు సుచిత్ర కూడలి సమీపంలోని ఎం.ఎన్‌. రెడ్డినగర్‌ వీకే రెసిడెన్సీలో ఉంటున్నారు. పెళ్లైన రోజు నుండి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం నాడు భార్యభర్తలు మేడపైకి వెళ్లారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలోనే శ్రీదేవి అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా.. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

“ఇది ధృవీకరించబడవలసి ఉన్నప్పటికీ, 25 రోజుల క్రితం జరిగిన తన వివాహం పట్ల ఆమెకు ఇష్టం లేదని మేము అనుమానిస్తున్నాము. పెళ్లికి అంగీకరించమని ఆమె కుటుంబసభ్యులు కొంచెం ఒత్తిడి చేశారు. అది భరించలేక పోయి ఉండవచ్చు” అని ఇన్‌స్పెక్టర్ చెప్పాడు. శ్రీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి కుటుంబసభ్యులకు అప్పగించారు. తదుపరి విచారణ జరుగుతోందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Next Story