హైదరాబాద్‌లో రేవ్‌పార్టీ భగ్నం.. సినీ నిర్మాతతో పాటు ప్రముఖుల అరెస్ట్‌

హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. మాదాపూర్‌లో రేవ్ పార్టీని నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది.

By అంజి  Published on  31 Aug 2023 8:11 AM IST
Narcotics Bureau, drug party, Madhapur, Hyderabad

హైదరాబాద్‌లో రేవ్‌పార్టీ భగ్నం.. నిర్మాతతో పాటు ప్రముఖుల అరెస్ట్‌

హైదరాబాద్‌ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. మాదాపూర్‌లో రేవ్ పార్టీని నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది. అర్ధరాత్రి సమయంలో ఐటి కంపెనీల పక్కనే ఉన్న ఫ్రెష్ లివింగ్ స్పేస్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో రహస్యంగా రేవ్ పార్టీ నిర్వహించారు. అర్థరాత్రి సమయంలో రహస్యంగా నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 84 లో గుట్టు చప్పుడు కాకుండా రేవు పార్టీ నిర్వహిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే నార్కోటిక్ బ్యూరో దాడులు చేసి డ్రగ్స్ సేవిస్తున్న ఐదుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సినీ నిర్మాత, ఫైనాన్షియర్‌ వెంకట్‌తో పాటు పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన బాలాజీ, కె.వెంకటేశ్ర్‌రెడ్డి, డి.మురళి, మధుబాల, మేహక్‌ల నుంచి కోకైన్‌, ఎల్‌ఎస్‌డీ, రూ.70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన యువతులు సైతం ఉన్నట్లు సమాచారం. అనంతరం తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసిన వారిని స్వాధీనం చేసుకున్న వాటిని తదుపరి విచారణ నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

ఢమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్ సూర్య సినిమాలకు ఫైనాన్సర్ గా పని చేసిన వెంకట్ ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ పార్టీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సినీ నిర్మాత వెంకట్ గుడ్డు చప్పుడు కాకుండా అపార్ట్మెంట్ రేవ్ పార్టీ పెడుతున్నాడు. ఈ పార్టీకి ప్రముఖులను ఆహ్వానిస్తున్నాడు. అయితే వెంకట్ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా నార్కోటిక్ బ్యూరోకి విశ్వసనీయమైన సమాచారం రావడంతో గత మూడు నెలలుగా వెంకట్ కదలికలపై అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో వెంకట్ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో వెంటనే నార్కోటిక్ బ్యూరో బృందం దాడులు చేసి సినీ ఫైనాన్సర్ వెంకట్ తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

బాలాజీ, కే. వెంకటేశ్వరరెడ్డి, డి. మురళి, మధుబాల, మెహెక్ లను అరెస్టు చేశారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకట్ ఫ్లాట్లో వీకెండ్ సమయంలో ఇచ్చే రేవ్ పార్టీ లో డ్రగ్స్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్‌తో పాటు ఇద్దరు మైనర్ అమ్మాయిలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వెంకట్ అరెస్టు చేసి అతని వద్ద నుండి ఐఎస్‌డి డ్రగ్స్‌తో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీపై చాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అధికారులు వెంకట్‌కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అయితే వెంకట్ గోవా నుండి డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.

Next Story