విషాదం.. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన దంపతులు మృతి

నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన దంపతులు విగతజీవులుగా ఇంటికి తిరిగొచ్చారు.

By అంజి
Published on : 19 Sept 2023 1:35 PM IST

Nalgonda, Couple, morning walk, Telangana

విషాదం.. మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన దంపతులు మృతి  

నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన దంపతులు విగతజీవులుగా ఇంటికి తిరిగొచ్చారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని పానగల్ వద్ద ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. మృతులు పానగల్‌కు చెందిన ఓర్సు విష్ణుమూర్తి, స్వప్నగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని వేగంగా రావడంతో దంపతులు మృతి చెందారు. విష్ణుమూర్తి నల్గొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌)కి తరలించారు. ఇదిలావుండగా, ఘటనకు పాల్పడిన వాహనాన్ని గుర్తించేందుకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story