త‌న‌కు వివాహం కాకుండా బాయ్‌ప్రెండ్ అడ్డు ప‌డుతున్నాడ‌ని ఓ యువ‌తి అత‌డిని హ‌త్య చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్రియుడిని చంపేందుకు ఫ్లాన్ వేసింది. ఇందుకోసం హంత‌కుడికి డ‌బ్బుతో పాటు ఓ రాత్రి ప‌డ‌క సుఖాన్ని ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేసింది. అనుకున్న‌ట్లుగా బాయ్‌ఫ్రెండ్ అడ్డుతొల‌గించుకుంది. అయితే.. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో ప్ర‌స్తుతం క‌ట‌క‌టాలు లెక్కిస్తోంది. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో వెలుగులోకి వ‌చ్చింది.

నాగాపూర్‌కు చెందిన చందూ మహాపూర్ వివాహితుడు. అత‌డు 20ఏళ్ల యువ‌తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవ‌ల ఆ యువ‌తికి పెళ్లి నిశ్చ‌యం అయింది. అయితే.. ఆ యువ‌తి పెళ్లి చేసుకునేందుకు చందు నిరాక‌రించాడు. త‌న పెళ్లి చెడ‌గొడ‌తాడ‌ని చెప్పేవాడు. దీంతో చందును అడ్డుతొల‌గించుకోవాల‌ని ఆ యువ‌తి భావించింది. అతడిని చంపేందుకు భరత్ గుర్జర్‌ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌తో డీల్ కుదుర్చుకుంది. హత్య చేసిన తర్వాత అతడికి రూ. 1.50 లక్షలు ఇస్తానని.. దాంతో పాటు ఓ రాత్రి అత‌డితో క‌లిసి ఉంటాన‌ని చెప్పింది. ఈ ఆఫ‌ర్ అత‌డికి న‌చ్చ‌డంతో వెంట‌నే.. చందూను మ‌ద్యం తాగ‌డానికి పిలిచి.. నిర్మానుష్య ప్రాంతంలో త‌ల ప‌గుల‌గొట్టి హ‌త్య చేశాడు.

ఈ ఘ‌ట‌న పిబ్ర‌వ‌రి 25న జ‌రిగింది. ఆపై మృత‌దేహాన్ని ఓ క్ర‌ష‌ర్ మైన్ వ‌ద్ద ప‌డేశారు. చందు హ‌త్య‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. అస‌లు విష‌యం బ‌ట‌య‌కు వ‌చ్చింది. దీంతో స‌ద‌రు యువ‌తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. గుర్జార్‌కు అందాల్సిన ఒక రాత్రి ప్రతిఫలం దక్కకముందే విషయం మొత్తం బట్టబయలైంది.
తోట‌ వంశీ కుమార్‌

Next Story