అల్మారాలో కుళ్లిపోయిన తల్లి మృతదేహం.. కూతురిపై అనుమానం

ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బుధవారం 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో కనుగొనబడింది.

By అంజి  Published on  15 March 2023 8:56 AM GMT
Mumbai, Crime news

అల్మారాలో కుళ్లిపోయిన తల్లి మృతదేహం.. కూతురిపై అనుమానం

ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బుధవారం 53 ఏళ్ల మహిళ మృతదేహం ప్లాస్టిక్ సంచిలో కనుగొనబడింది. మృతదేహాన్ని నెలల తరబడి గదిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళ కుమార్తె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 ఏళ్ల మహిళ తన వితంతువు తల్లి మృతదేహాన్ని ప్లాస్టిక్ షీట్‌లో చుట్టి దాదాపు మూడు నెలల పాటు అల్మారాలో దాచి ఉంచినట్లు ముంబై పోలీసులు బుధవారం తెలిపారు. వితంతువు వీణా ప్రకాష్ జైన్‌గా పోలీసులు గుర్తించారు. ఆమె సోదరుడి కుటుంబం ఇచ్చిన 'మిస్సింగ్‌' ఫిర్యాదుపై కాలాచౌకి పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు మంగళవారం అర్థరాత్రి ఈ సంఘటన కనుగొనబడింది.

పోలీసు బృందం లాల్‌బాగ్ ప్రాంతంలోని పెరూ కాంపౌండ్‌లోని వారి ఇంటికి చేరుకుంది. అయితే మృతురాలి కూతురు మొదట్లో వారిని ఇంటి లోపలికి అనుమతించలేదు. అంతకుముందు ఆమె తన అత్త (మరణించిన) తర్వాత విచారించడానికి వచ్చిన తన కజిన్ సోదరుడిని కూడా అలాగే పంపించివేసింది. బాగా కుళ్లిపోయిన స్థితిలో వీణా ప్రకాష్ జైన్‌ మృతదేహానికి కత్తిపోట్లు ఉన్నాయని, ఆమె చేతులు, కాళ్ళు వంటి ఇతర భాగాలు కత్తిరించబడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ కోసం ఫోరెన్సిక్ బృందం మొత్తం ఫ్లాట్ చుట్టూ తిరిగారు.

ప్రకాష్ జైన్ మరణించిన తర్వాత వీణా ప్రకాష్‌ జైన్‌ 16 సంవత్సరాల క్రితం పాల్ఘర్‌లోని విరార్ నుండి లాల్‌బాగ్‌కు మారారని, మరణించిన వీణా సోదరుడు ఆమెకు నెలవారీ ఆర్థిక సహాయంతో ఆదుకునేవాడని ఒక అధికారి తెలిపారు. అయితే గత మూడు నెలలుగా అనేక సార్లు సందర్శించినప్పటికీ సోదరుడు తన వృద్ధ సోదరి వీణను కలవలేకపోయాడు. ప్రతిసారీ కుమార్తె 'ఆమె బయటికి వెళ్లింది' లేదా 'విశ్రాంతి తీసుకుంటోంది' అని కొన్ని సాకులు చెప్పి ఇంటి నుంచి పంపించేసేది.

అర్థరాత్రి మహిళ బంధువు చేసిన మరో ప్రయత్నం విఫలమైన తరువాత, సోదరుడి కుటుంబం కాలాచౌకి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి బృందాన్ని పంపారు. మొదట్లో ఆ మహిళ పోలీసులను అనుమతించలేదు కానీ ఇంట్లో నుంచి దుర్వాసన వెదజల్లుతున్నట్లు పసిగట్టారు. వీణా మృతదేహాన్ని శవపరీక్ష కోసం కేఈఎమ్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. కలాచౌకి పోలీసులు విచారణ కోసం మృతురాలి కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.

"హత్యకు కారణం, అది ఎప్పుడు జరిగింది, ఎవరిచేత జరిగింది, ఇంకా స్పష్టంగా తెలియలేదు... పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మేము తదుపరి చర్యలు తీసుకుంటాము" అని ఓ అధికారి తెలిపారు. ఆ మహిళకు మంచి బుద్ధి ఉందా, ఆమె తల్లి మరణంతో ఆమెకు ఏమైనా సంబంధం ఉందా, ఆమె తన ఇంటిలో మృత శరీరంతో ఎందుకు ఎక్కువ కాలం జీవించడానికి ఎంచుకుంది అనే విషయాలు కూడా విచారణలో తేలనున్నాయి.

Next Story