42 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చి..

Mumbai Woman Gang-Raped, Tortured With Sharp Weapons. మెట్రో నగరాల్లో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో

By అంజి  Published on  5 Dec 2022 1:00 PM IST
42 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చి..

మెట్రో నగరాల్లో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మరో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కుర్లాలో 42 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు బాధితురాలి నివాసంలోకి చొరబడ్డారు. ఆమెపై లైంగిక వేధింపులకు ముందు పదునైన ఆయుధంతో దాడి చేశారు. చిత్రహింసలకు గురిచేయడంతో పాటు బాధితురాలి ప్రైవేట్‌ భాగాలపై సిగరెట్‌తో కాల్చారు. దీంతో మహిళకు గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన బుధవారం తెల్లవారుజామున కుర్లాలో చోటుచేసుకుంది.

ముంబయి పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ముగ్గురూ మహిళ ఇంటికి చాలా దూరంలో నివసిస్తున్నారు. నిందితులు ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అత్యాచారం చేయడంతోపాటు అసహజ శృంగారం కూడా చేశారని, ఆమె ప్రైవేట్ భాగాలను సిగరెట్‌తో కాల్చివేసి, ఛాతీపై, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారని, ఆ భయానక ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. పోలీసులను ఆశ్రయిస్తే వీడియో ప్రచారం చేస్తానని బెదిరించారని పోలీసు అధికారి తెలిపారు.

కుర్లా పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒక ఎన్జీవోను సంప్రదించిన మహిళ తన పొరుగువారికి ఈ సంఘటన గురించి చెప్పిన తర్వాత ఈ భయంకరమైన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 376 (రేప్), 376డి (గ్యాంగ్ రేప్), 377 (అసహజ సెక్స్), 324 (ప్రమాదకరమైన ఆయుధంతో స్వచ్ఛందంగా గాయపరచడం) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఈ విషయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ముంబైలోని మాతుంగా ప్రాంతంలోని పౌర పాఠశాలలో తరగతి గదిలో తమ 13 ఏళ్ల క్లాస్‌మేట్‌పై అత్యాచారం చేసినందుకు ఇద్దరు అబ్బాయిలను అరెస్టు చేశారు.

Next Story