వైఫై పాస్‌వర్డ్‌ చెప్పలేదని.. యువకుడిని దారుణంగా చంపేశారు.!

Mumbai teenager killed for refusing to share wi-fi password. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వై-ఫై హాట్‌స్పాట్ పాస్‌వర్డ్ చెప్పమంటే

By అంజి  Published on  2 Nov 2022 1:51 PM IST
వైఫై పాస్‌వర్డ్‌ చెప్పలేదని.. యువకుడిని దారుణంగా చంపేశారు.!

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వై-ఫై హాట్‌స్పాట్ పాస్‌వర్డ్ చెప్పమంటే చెప్పలేదని ఓ 17 ఏళ్ల బాలుడిని ఇద్దరు వ్యక్తులు ముంబైలో కత్తితో పొడిచి చంపారు. విశాల్ రాజ్‌కుమార్ మౌర్య అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు అతని వై-ఫై పాస్‌వర్డ్ అడిగారు. ఈ సంఘటన ముంబైలోని కమోతే ప్రాంతంలో గత వారం ఒక పాన్ షాప్ సమీపంలో జరిగింది. యువకుడు వైఫై పాస్‌వర్డ్‌ చెప్పడానికి నిరాకరించడంతో ఇద్దరు నిందితులు అతనిపై దుర్భాషలాడారు.

ఆ తర్వాత వారి మధ్య గొడవ జరిగింది. ముగ్గురి మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి విశాల్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయినా ముంబై పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. కత్తిపోట్లకు గురైన తరువాత బాధితుడు కొన్ని అడుగులు నడవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

"ముంబయిలోని కమోతే ప్రాంతంలో వైఫై హాట్‌స్పాట్ పాస్‌వర్డ్ ఇవ్వలేదని ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలుడిని హత్య చేశారు. వారి మధ్య గొడవ జరగడంతో ఇద్దరు నిందితులు బాధితుడిని కత్తితో పొడిచారు" అని డీసీపీ వివేక్ పన్సారే చెప్పారని ప్రముఖ వార్త సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. ఇద్దరు నిందితులు రవీంద్ర అత్వాల్ అకా హర్యానివి, సంతోష్ వాల్మీకి హత్యా నేరం కింద అభియోగాలు మోపారు.

Next Story