ఇద్దరు మైనర్‌ బాలికల.. నగ్న చిత్రాలు, వీడియోలు తీసిన పని మనిషి.. చివరికి

Mumbai Police arrests servant for filming two minor girls. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగు చూసింది. దక్షిణ ముంబైలో తన యజమాని యొక్క 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల

By అంజి
Published on : 6 March 2022 2:08 PM IST

ఇద్దరు మైనర్‌ బాలికల.. నగ్న చిత్రాలు, వీడియోలు తీసిన పని మనిషి.. చివరికి

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగు చూసింది. దక్షిణ ముంబైలో తన యజమాని యొక్క 13 ఏళ్ల కుమార్తె, 11 ఏళ్ల మేనకోడలు నగ్న చిత్రాలు, వీడియోలను పని మనిషి తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఎనిమిదేళ్లుగా దక్షిణ ముంబైలోని ఓ గిఫ్ట్ షాపు యజమాని ఇంట్లో పని మనిషిగా చేస్తున్నాడు. తన యజమాని లేనప్పుడు, అతను మైనర్‌ బాలికలు బట్టలు మార్చుకునే సమయంలో వారి ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేసేవాడు. మంగళవారం గిఫ్ట్ షాపు యజమాని కూతురు నిందితుడి మొబైల్ ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

"గేమ్‌ ఆడుతున్నప్పుడు.. ఫోన్‌లో ఆమె బట్టలు మార్చుకునేటప్పుడు వారి ఇంటి పనిమనిషి క్లిక్ చేసినట్లు గుర్తించింది" అని ఒక పోలీసు అధికారి చెప్పాడు. అంతేకాకుండా నిందితుడి ఫోన్‌లో మైనర్ తన 11 ఏళ్ల బంధువు ఫోటోలను కూడా చూసింది. మైనర్ బంధువు తరచుగా వారి ఇంటికి వచ్చేది. ఈ విషయాన్ని ఆమె తల్లికి తెలియజేయగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 354 (సీ), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

Next Story