హైప్రొఫైల్ సెక్స్ రాకెట్‌.. భోజ్‌పురి నటి అరెస్టు

Mumbai police arrests Bhojpuri actress for forcing aspiring models into prostitution. ముంబై పోలీసులు హైప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను బయటపెట్టారు.

By M.S.R  Published on  22 April 2023 9:45 AM IST
హైప్రొఫైల్ సెక్స్ రాకెట్‌.. భోజ్‌పురి నటి అరెస్టు

ముంబై పోలీసులు హైప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను బయటపెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఓ భోజ్‌పురి నటిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంతో మంది అమాయక మహిళలను సెక్స్ రాకెట్ లోకి దించిన సుమన్ కుమారి అనే నటిని అరెస్టు చేశారు. ఆరే కాలనీలోని రాయల్ పామ్ హోటల్‌లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిందితులను ట్రాప్ చేసేందుకు పోలీసులు నకిలీ కస్టమర్‌ను హోటల్‌కు పంపారు. ఒక్కో మోడల్‌కు 50,000 నుంచి 80,000 రూపాయల డబ్బులు తీసుకుని విటుల వద్దకు పంపిస్తూ ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమన్ కుమారి (24) అనే భోజ్‌పురి నటి, కస్టమర్లకు మోడల్స్ సరఫరా చేసేది. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించాలని అనుకుని ముంబైకి వచ్చిన యువతుల డబ్బు అవసరం గుర్తించి సుమన్ కుమారి వారిని వ్యభిచారంలోకి దింపేది. సుమన్ కుమారి అనేక భోజ్‌పురి చిత్రాలలో పనిచేసింది. లైలా మజ్నుతో పాటు, ఆమె బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి వంటి భోజ్‌పురి కామెడీ షోలను కూడా చేసింది. బూమ్ OTT ఛానెల్‌లో కూడా పనిచేసింది.

ముంబై పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచ్ నటిని అరెస్టు చేసింది. పోలీసుల విచారణ ప్రకారం, సుమన్ కుమారి ఆరేళ్లుగా ముంబైలో నివసిస్తోంది. అయితే ఆమె సెక్స్ రాకెట్‌లో ఎప్పుడు పని చేయడం ప్రారంభించిందనే సమాచారం అందుబాటులో లేదు.


Next Story