సోషల్ మీడియాలో ఇద్దరూ స్నేహితురాలుగా మారారు. ఇబ్బందుల్లో ఉన్నానని.. కొన్నాళ్లు ఇంట్లో చోటు ఇవ్వాలని బ్రతిమిలాడాడు. స్నేహితుడే కదా అని ఇంట్లో చోటిస్తే.. ఏకంగా స్నేహితురాలి ఇంటికే కన్నం వేశాడు. ఈ ఘటన ముంబయిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలో ఖుష్భూ అగర్వాల్ నివాసం ఉంటోంది. ఆమె ఓ మోడల్. తనకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమన్యుగుప్తా(28) పరిచయం అయ్యాడు. అతడికి టిక్‌టాక్‌లో తొమ్మిది లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తనకు ముంబయిలో ఫ్లాట్ దొరికే వరకు ఖుష్భూ ఇంట్లో ఉంటానని గుప్తా బ్రతిమిలాడాడు.స్నేహితుడే కదా అని ఆమె అందుకు అంగీకరించింది. కాగా.. గత నెలలో పనినిమిత్తం డిసెంబర్ 18 నుంచి 22 వరకు విదేశాలకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉండే రూ.5లక్షల నగదు, బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయి.
అయితే.. ఆమె జనవరి 1 తేదిన చోరి విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని అలా చేస్తే తన ఫ్రెండ్స్‌నే పోలీసులు వేదిస్తారని గుప్తా చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా కేసును చేదించారు. నిందితుడు బ్లాక్ లెదర్ బూట్లు, బుర్ఖా వేసుకున్నట్లు గుర్తించారు. అతడి శరీర కదలికలు గుప్తాతో మ్యాచ్ అవ్వడంతో అరెస్టు చేశాడు. 2011 నుంచే నిందితుడుకి చోరీలు చేసే అలవాటు ఉందని పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన అభరణాలు, నగదును బైక్ సీటు కింద ఉంచినట్లు గుర్తించారు.