దారుణం.. 10 ఏళ్ల బాలికను గార్డెన్‌కు తీసుకెళ్లి అత్యాచారం

ముంబైలో పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి
Published on : 30 July 2025 7:14 AM IST

Mumbai, 10-year-old girl, garden, Crime

దారుణం.. 10 ఏళ్ల బాలికను గార్డెన్‌కు తీసుకెళ్లి అత్యాచారం

ముంబైలో పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బాలికను బెదిరించాడని పోలీసులు తెలిపారు. ముమాబి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసు అధికారుల ప్రకారం.. ముంబైలోని ఆంటోప్ హిల్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర 10 ఏళ్ల బాధితురాలు తన సోదరుడితో కలిసి ఆడుకుంటుండగా, నిందితుడు ఆ పిల్లలను సమీపంలోని గార్డెన్‌కి రప్పించారని ఆరోపించారు. గార్డెన్‌కు చేరుకున్న తర్వాత, నిందితుడు బాలిక సోదరుడిని ఆహారం తీసుకురావడానికి పంపించి బాలికను వేధించాడు. ఆపై బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు ఆమెను బెదిరించాడు.

బాధితురాలు ఇటీవలే ఈ సంఘటన గురించి తన తల్లికి చెప్పగా, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం.. ఆరోపించిన నేరం జూలై 20 మరియు జూలై 26 మధ్య జరిగింది. ఫిర్యాదు మేరకు, పోలీసులు ఒక బృందాన్ని పంపి నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని అధికారులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

Next Story