ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి..

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగు చూసింది. మీరా రోడ్‌లోని తన అద్దె అపార్ట్‌మెంట్‌లో 56 ఏళ్ల వ్యక్తి తన జీవిత

By అంజి  Published on  8 Jun 2023 7:44 AM IST
Mumbai man, live in,partner, Crime news, Mumbai Mira Road

ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి.. కుక్కర్‌లో ఉడకబెట్టి..

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ ఘటన వెలుగు చూసింది. మీరా రోడ్‌లోని తన అద్దె అపార్ట్‌మెంట్‌లో 56 ఏళ్ల వ్యక్తి తన జీవిత భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికినందుకు అరెస్టు చేయబడ్డాడు. ఆ వ్యక్తి తన భాగస్వామి మృతదేహాన్ని చెట్టు కట్టర్‌తో నరికి, ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడు మనోజ్ సహాని అనే వ్యక్తి గత మూడేళ్లుగా గీతా నగర్ ఫేజ్ 7లోని గీతా ఆకాష్ దీప్ భవనంలోని ఫ్లాట్ 704లో సరస్వతి వైద్య (36)తో కలిసి ఉంటున్నాడు.

రెండు రోజులుగా ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని ఇంట్లో కుళ్లిపోయిన శరీర భాగాలను బట్టి హత్య మూడు-నాలుగు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికినట్లు గుర్తించింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాల్కర్‌ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

Next Story