విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హత్యాయ‌త్నం

Mother with three children suicide attempt in Srikakulam District.శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2022 11:53 AM IST
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హత్యాయ‌త్నం

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌గా.. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు అయ్యాయి.

జ‌లుమూరు మండ‌లం య‌ల‌మంచిలి గ్రామంలో చిన్న‌మ్మడు(46), న‌ర‌సింహులు దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి రంజిని(20), జాహ్న‌వి(17), శ‌శాంక‌ర్(14) సంతానం. అయితే.. ఏ క‌ష్టం వ‌చ్చిందో తెలీదు గానీ చిన్న‌మ్మడు త‌న ముగ్గురు పిల్ల‌తో క‌లిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ప‌క్క గదిలో ఉన్న న‌ర‌సింహులు, స్థానికులు గ‌మ‌నించి మంట‌ల‌ను ఆర్పి శ్రీకాకుళం రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. చిన్న‌మ్మడు, జాహ్న‌వి మృతి చెంద‌గా.. రంజ‌ని, శ‌శాంక‌ర్ తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతున్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. చిన్న‌మ్మ‌డు భ‌ర్త న‌ర‌సింహులును విచారిస్తున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story