కూతురి ప్రియుడి కళ్లలో.. కారం పొడి పోసి కొట్టిన తల్లీకొడుకులు

Mother, sons nabbed for throwing chilli powder, beating daughter's lover in Pune. తన కూతురు ప్రియుడి ముఖంపై కారం పోసి రాడ్లతో కొట్టినందుకు ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమారులను పూణె పోలీసులు

By అంజి  Published on  16 Sept 2022 1:55 PM IST
కూతురి ప్రియుడి కళ్లలో.. కారం పొడి పోసి కొట్టిన తల్లీకొడుకులు

తన కూతురు ప్రియుడి ముఖంపై కారం పోసి రాడ్లతో కొట్టినందుకు ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమారులను పూణె పోలీసులు పట్టుకున్నారు. సెప్టెంబర్ 13న చించ్వాడ్ ప్రాంతంలోని పోష్ సొసైటీ సమీపంలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహిళ కుమార్తెతో విశాస్‌ కస్బే అనే వ్యక్తి గత ఆరేళ్లుగా ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమెను కలిసేందుకు వచ్చాడు.

అయితే అతను తన ప్రియురాలిని కలవకముందే, ఆమె తల్లి, ఇద్దరు మైనర్ సోదరుల కంటపడ్డాడు. వారు ఇంటి నుండి బయటకు వచ్చి అతన్ని ప్రశ్నించడంతో గొడవకు దారితీసింది. బాధితుడి ముఖంపై మహిళ కారంపొడి చల్లడంతో.. అతడు నిస్సహాయస్థితిలో ఉండిపోయాడు. పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఆమె కుమారులు ఆ వ్యక్తిపై రాడ్‌తో దాడి చేసి దారుణంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. సొసైటీకి చెందిన కొందరు వ్యక్తులు బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతని తలపై అనేక గాయాలు ఉన్నాయి. పుణె పోలీసులు ఆ వ్యక్తిపై దాడి చేసినందుకు భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 307 కింద తల్లిని అరెస్టు చేశారు. మహిళ ప్రస్తుతం కటకటాల వెనుక ఉండగా, ఆమె కుమారులను అదుపులోకి తీసుకుని జువైనల్ కరెక్షన్ హోంకు తరలించారు.

Next Story