తాంత్రికుడితో వివాహేతర సంబంధం.. 4 నెలల చిన్నారిని బలి ఇచ్చిన తల్లి

Mother sacrifices her 4-month-old to fulfil her wish in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో తాంత్రికుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ

By అంజి  Published on  9 Jan 2023 8:12 AM IST
తాంత్రికుడితో వివాహేతర సంబంధం.. 4 నెలల చిన్నారిని బలి ఇచ్చిన తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో తాంత్రికుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన కోరిక తీర్చుకునేందుకు తన బిడ్డను చంపేసింది. సుల్తాన్‌పూర్‌లోని గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనౌదిహ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కోరిక తీర్చుకునేందుకు 4 నెలల చిన్నారిని బలితీసుకున్న మహిళను అరెస్టు చేశారు. తాను కోరుకున్నది పొందేందుకు బిడ్డను బలి ఇవ్వాలని తాంత్రికుడు కోరడంతో మహిళ ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.

సుల్తాన్‌పూర్‌లోని గోసాయిగంజ్ పోలీస్ స్టేషన్‌లోని ధనౌడిహ్ గ్రామంలో 35 ఏళ్ల మంజు దేవి గ్రామంలోని నల్లటి విగ్రహం ముందు పారతో తన బిడ్డను నరికి బలి ఇచ్చిన సంఘటన జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.మంజుదేవిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. చిన్నారిని చంపేందుకు ఉపయోగించిన గడ్డపారను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, తన బిడ్డను చంపడానికి మహిళను ప్రభావితం చేసిన తాంత్రికుడి కోసం పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నారు. థానా గోసాయిగంజ్‌లోని మజ్రే ధనువాడిహ్‌లో ఓ తల్లి తన 4 నెలల చిన్నారిని గడ్డపారతో హత్య చేసిందని సుల్తాన్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ సోమెన్ వర్మ తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న తాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.

Next Story