ఏకాంతంగా ఉన్న‌ప్పుడు చూసింద‌ని.. మామ‌తో క‌లిసి క‌న్న కుమారైను చంపిన త‌ల్లి

Mother Killed her daughter in Khammam District.ఇటీవ‌ల కాలంలో మాన‌వ సంబంధాలు మంటగ‌లిసి పోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2022 5:08 AM GMT
ఏకాంతంగా ఉన్న‌ప్పుడు చూసింద‌ని.. మామ‌తో క‌లిసి క‌న్న కుమారైను చంపిన త‌ల్లి

ఇటీవ‌ల కాలంలో మాన‌వ సంబంధాలు మంటగ‌లిసి పోతున్నాయి. ప‌రాయి వారి మోజులో ప‌డి క‌ట్టుకున్న‌వారిని, క‌న్న బిడ్డ‌ల‌ను క‌డ‌తేర్చేందుకు వెన‌కాడ‌డం లేదు కొంద‌రు. న‌వ మాసాలు మోసి పెంచిన క‌న్న త‌ల్లి.. త‌న వివాహేత‌ర సంబంధాన్ని చూసింద‌ని కుమారైను దారుణంగా హ‌త మార్చింది. ఫిట్స్‌తో చ‌నిపోయింద‌ని అంద‌రినీ న‌మ్మించేందుకు విఫ‌ల య‌త్నం చేసింది. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. బోనకల్‌కు చెందిన న‌రసింహారావు కుమారుడు హ‌రికృష్ణ‌కు సునీత‌తో 12 సంవ‌త్స‌రాల క్రితం వివాహమైంది. వీరికి మహాదేవి(11) సంతానం. కాగా.. హ‌రికృష్ణ లారీ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తూ.. ప‌ని నిమిత్తం త‌ర‌చూ దూర ప్రాంతాల‌కు వెళ్లేవాడు. ఈ క్ర‌మంలో భ‌ర్త తండ్రి న‌ర్సింహారావుతో సునీత‌కు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. కొన్నేళ్లుగా గుట్టుగా వీరి బంధాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇటీవ‌ల తాత, తల్లి ఒకే గ‌దిలో ఉండ‌గా.. మ‌హాదేవి చూసింది. విష‌యాన్ని తండ్రిని చెబుతాన‌ని అన‌డంతో.. మామ‌తో క‌లిసి సునీత కుమారైను హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడ బిగించి హతమార్చారు. త‌న కుమారై ఫిట్స్‌తో చ‌నిపోయిన‌ట్లు అంద‌రిని న‌మ్మించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. పాప మెడ‌పై క‌మిలిన గాయాలు ఉండ‌డంతో బంధువులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. మృత‌దేహానికి ఆస్ప‌త్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా.. హ‌త్య‌గా నిర్థార‌ణ అయింది. బాలిక త‌ల్లి, తాత‌పై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. తామే హ‌త్య చేసిన‌ట్లు వారు అంగీక‌రించారు. కేసును త్వరగా ఛేదించిన మధిర సీఐ మురళి, ఎస్‌ఐ కవిత, సిబ్బంది నాగేశ్వరరావు, సత్యంబాబు, శాంత్‌కుమార్‌ను ఏసీపీ అభినందించి క్యాష్‌ రివార్డు అందజేశారు.

Next Story