దారుణం.. పుట్టుకతో తన పోలికలు రాలేదని.. 3 నెలల కూతురిని చంపిన తల్లి
మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సొంత 3 నెలల కూతురిని హత్య చేసిన కేసులో
By అంజి Published on 23 March 2023 4:12 PM IST
పుట్టుకతో తన పోలికలు రాలేదని.. 3 నెలల కూతురిని చంపిన తల్లి
మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన సొంత 3 నెలల కూతురిని హత్య చేసిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకు మహిళ పోలీసులకు చెప్పిన కారణం చాలా షాకింగ్‌గా ఉంది. తన కూతురి ముఖం భర్త ముఖాన్ని పోలి ఉంటుందని ప్రజలు చెబుతుంటారని, ఈ క్రమంలోనే తల్లి ఈ హత్యకు పాల్పడిందని పోలీసులకు తెలిపారు. కూతురికి భర్త పోలికలు వచ్చాయని అందరూ అంటుండంతో విసుగు చెంది కోపంతో కూతురిని చంపేసింది.
ఇంతకు ముందు విచారణలో మహిళ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. సోమవారం సాయంత్రం ఓ మహిళ తన ఇంట్లోకి ప్రవేశించి ఏదో రసాయనం వాడి తనను అపస్మారక స్థితిలోకి నెట్టి కూతురు గొంతు కోసి చంపిందని గంగాపూర్ శివారు ప్రాంతానికి చెందిన మహిళ పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో మహిళ, ఆమె బంధువుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలు ఉన్నట్లు గుర్తించారు.
అదే సమయంలో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలు కూడా మహిళ చెప్పిన వివరాలతో సరిపోలలేదు. పోలీసులు మహిళను తమదైన శైలిలో విచారించడంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. తన కూతురు తన భర్తలా కనిపిస్తాడని తన అత్తమామలు తరచూ చర్చించుకునేవారని, ఇది విన్న తర్వాత తాను కలత చెందానని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.