విషాదం.. ముగ్గురు చిన్నారుల‌తో పాటు చెరువులో దూకిన తల్లి

Mother Jumped into a pond with childrens in Medchal Malkajgiri district.మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో విషాదం చోటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2022 3:46 PM IST
విషాదం.. ముగ్గురు చిన్నారుల‌తో పాటు చెరువులో దూకిన తల్లి

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఓ మ‌హిళ త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి చెరువులోకి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. త‌ల్లి, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి చెంద‌గా.. ఓ చిన్నారి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మేడ్చల్ మండలం రాజా బొల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. రాజా బొల్లారం గ్రామంలో బ్రాహ్మణపల్లి భిక్షపతి, మమత(28) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి ముగ్గురు చిన్నారులు సంతానం. గ‌త కొద్ది రోజులుగా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. భ‌ర్త వేదింపులు ఇటీవ‌ల తీవ్రం కావ‌డంతో మమత తీవ్ర మ‌న‌స్థాపం చెందింది. బుధ‌వారం ఉద‌యం త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి గ్రామ శివారులోని చెరువులోకి దూకి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌మ‌త‌తో పాటు పాప‌(3), బాబు(1) మృతి చెంద‌గా.. ఇంకో కుమారుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను చెరువులోంచి బ‌య‌ట‌కు తీశారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story