అనంతలో విషాదం.. తల్లీకొడుకు సజీవ దహనం
Mother and Son burned alive in Ananthapuram.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది.తల్లీకొడుకు సజీవ దహనం
By తోట వంశీ కుమార్ Published on
23 Feb 2021 7:48 AM GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో మంగళవారం ఉదయం విద్యుత్ తీగలు తెగిన ఘటనలో తల్లీకొడుకు సజీవదహనం అయ్యారు. పెద్దపప్పూరు మండలం వరదాయపాలెంనకు చెందన వెంకటస్వామి (37) తల్లి వెంకటలక్ష్మమ్మ (55)తో కలిసి కూలీ పని కోసం ద్విచక్ర వాహనంపై వెలుతున్నారు. బండ్లబాటపై విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగిపడి ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించని వెంకటస్వామి.. కరెంట్ తీగపై నుంచి బైక్‌ను పోనిచ్చాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తల్లీ కొడుకుకు మంటలు అంటుకుని అక్కడిక్కడే సజీవ దహానం అయ్యారు.
కూలీ పనులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story