అగ్నిప్ర‌మాదంలో త‌ల్లీ, కూత‌రు స‌జీవ‌ద‌హ‌నం

Mother and daughter burned alive in Konaseema District.కోన‌సీమ జిల్లాలో అగ్నిప్ర‌మాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2022 12:29 PM IST
అగ్నిప్ర‌మాదంలో త‌ల్లీ, కూత‌రు స‌జీవ‌ద‌హ‌నం

కోన‌సీమ జిల్లాలో అగ్నిప్ర‌మాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అగ్నిప్ర‌మాదంలో త‌ల్లీ, కూతురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. కోమ‌రిగిరిప‌ట్నం గ్రామంలోని ఆకుల వారి వీధిలో మంగాదేవి(40) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. శ‌నివారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల స‌మ‌యంలో వీరు నివ‌సిస్తున్న గుడిసెకు మంట‌లు అంటుకున్నాయి. ఈ ప్ర‌మాదంలో మంగాదేవితో పాటు ఆమె కుమారై మేడిశెట్టి జ్యోతి(23) స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. అయితే.. ఈ అగ్నిప్ర‌మాదంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తెల్ల‌వారుజామున గుడిసెకు మంట‌లు ఎలా అంటుకున్నాయి..? అనే ప్ర‌శ్నలు ఉత్ప‌న్నం అవుతున్నాయి. కాగా.. ఐదు నెల‌ల క్రిత‌మే జ్యోతి ప్రేమ వివాహాం చేసుకుంది. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అక్క‌డి ప‌రిసరాల‌ను ప‌రిశీలించి కేసు న‌మోదు చేశారు. మృతురాలి అల్లుడు మేడిశెట్టి సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుట్ర కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story