మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నివాసంలో సీసీటీవీ ఫుటేజి మాయం కావడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

By Kalasani Durgapraveen  Published on  11 Dec 2024 1:15 PM GMT
మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు నివాసంలో సీసీటీవీ ఫుటేజి మాయం కావడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ గొడవల్లో కీలకంగా ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. అయితే మోహన్ బాబు చికిత్స పొందుతున్న కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ను అరెస్ట్ చేశారు. విజయ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి వెంకట్ కిరణ్ సీసీ టీవీ ఫుటేజి మాయం చేసినట్టు గుర్తించారు. మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్ట్ జరిగింది.

మరోవైపు తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 24 వరకు పోలీసుల ఎదుట హాజరుకావడానికి మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చింది. ఈ కేసును డిసెంబర్ 24కి వాయిదా వేసింది. జర్నలిస్టులపై దాడికి సంబంధించి పోలీసులు ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్‌ను కోర్టు విచారించింది. తన నివాసం వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఘటనలో ఆయన ఆగ్రహానికి లోనై జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేశారు.

Next Story