యూపీలో దిగ్భ్రాంతికర ఘటనలు.. కాలిన గాయాల‌తో.. రోడ్డు ప‌క్క‌న న‌గ్నంగా ప‌డి ఉన్న విద్యార్థిని

Missing College Student found with 60% burn injuries in UP. క‌ళాశాల‌కు వెళ్లిన ఓ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో ఒంటి నిండా గాయాల‌తో న‌గ్నంగా జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న అచేత‌నావ‌స్థ‌త‌లో క‌నిపించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2021 3:09 AM GMT
Missing College Student found with 60% burn injurie

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. దేశంలో నిర్భ‌య వంటి క‌ఠిన చ‌ట్టాలు తీసుకువ‌చ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై దాడులు ఆగ‌డం లేదు. తాజాగా క‌ళాశాల‌కు వెళ్లిన ఓ విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో ఒంటి నిండా గాయాల‌తో న‌గ్నంగా జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న అచేత‌నావ‌స్థ‌త‌లో క‌నిపించింది. ఈ దిగ్భ్రాంతిక‌ర ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని షాజ‌హాన్‌పుర్‌లో చోటుచేసుకుంది.

మాజీ కేంద్రమాజీ మంత్రి స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలోని సుఖ్‌దేవానంద్ కాలేజీలో ఓ యువ‌తి బీఏ రెండో ఏడాది చదువుతోంది. సోమ‌వారం ఆమె త‌న తండ్రితో క‌లిసి కాలేజీకి వ‌చ్చింది. సాయంత్రం త‌ర‌గ‌తులు ముగిసినా.. ఆమె బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో తండ్రి ఆందోళ‌న చెందాడు. కాలేజీతో పాటు చుట్టు ప‌క్క‌ల వెతికినా కుమారై ఆచూకి దొర‌క‌లేదు. దీంతో వెంట‌నే ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈలోపలా.. ఆమె ల‌ఖ్‌న‌వూ-బ‌రేలీ జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న ప‌డి ఉన్న‌ట్లు స‌మాచారం అందింది.

వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసుల‌కు 60శాతం కాలిన గాయాల‌తో, రోడ్డు ప‌క్క‌న న‌గ్నంగా యువ‌తి క‌నిపించింది. వెంట‌నే ఆమెను ల‌ఖ్‌న‌వూలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆ యువ‌తి మాట్లాడే స్థితిలో లేద‌ని.. ఆమె కోలుకున్న త‌రువాత‌నే ఏం జ‌రిగింద‌న్న‌ది తెలుస్తుంద‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఐదేళ్ల బాలిక అనుమానాస్ప‌ద మృతి

షాజహాన్‌పూర్‌లోనే జరిగిన మరో ఘటనలో చెరువు వద్దకు వెళ్లిన ఐదేళ్ల బాలిక, ఆమెకు సోదరి వరుసయ్యే ఏడేళ్ల బాలిక అదృశ్యమయ్యారు. వారి కోసం వెతుకుతున్న సమయంలో ఐదేళ్ల బాలిక సమీపంలోని పొలంలో విగతజీవిగా కనిపించింది. మరో బాలిక తీవ్రంగా గాయపడి ఉంది. మరో ఘటనలో రాష్ట్రంలోని లిఖింపూర్‌లో సోమ, మంగళవారాల్లో నలుగురు కాలేజీ విద్యార్థినులు అదృశ్యమయ్యారు.


Next Story
Share it