స్నేహితురాలిని పెళ్లాడిన అమ్మ.. పిల్లలను నరబలి ఇచ్చేందుకు యత్నం
Minors complaint sp against mother.పిల్లల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే.. కన్నతల్లిదండ్రులే పిల్లను హత్య చేసేవారని తాత చెప్పాడు.
By తోట వంశీ కుమార్ Published on 14 April 2021 8:11 AM ISTతల్లిదండ్రులే పిల్లల పాలిట యమభటులుగా మారారు. శానిటైజర్ తాగించడంతో పాటు ఒంటినిండా కారం పూసి ఎండలో నిలబెట్టడం, దారుణంగా కొట్టడం వంటివి చేసేవారు. చివరకు పిల్లలను బలి ఇచ్చేందుకు సిద్దపడగా.. ఎలాగోలా తప్పించుకున్న చిన్నారులు తాతను కలిసి జరిగిన విషయం చెప్పారు. తాత సహాయంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌కు చెందిన రామలింగం(42), రంజిత(36) దంపతులు. వీరికి దీపక్(15), కిషాంత్(6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవాడు.
నాలుగేళ్ల క్రితం అతడు అదే ప్రాంతానికి చెందిన ఇందుమతి(32) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను అదే ప్రాంతంలో వేరే ఇంట్లో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలైన ధనలక్ష్మీ (38) అప్పుడప్పుడు వీరింటికి వస్తుండేది. ఈ క్రమంలో రంజితతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు రంజిత, ఇందుమతి పెళ్లి చేసుకుంటామని రామలింగంకు చెప్పగా.. అతడు సరేనన్నాడు. ఇంట్లోనే వీరిద్దరికి పెళ్లి కూడా చేశాడు. అంతేగాక ధనలక్ష్మీని నాన్నా అని, తండ్రైన రామలింగంను మామ అని పిలవాలని పిల్లలను వేదింపులకు గురిచేశారు.
నలుగురూ ఒకే ఇంటిలో ఉంటూ పిల్లలను పాఠశాలకు పంపకుండా ఇంటి పనులు చేయించేవారు. చిన్న పొరపాటు చేసినా మిరప్పొడి ఒళ్లంతాపూసి బాధలకు గురిచేసేవారు. కొన్నిసార్లు క్రిమినాశిని ద్రావకాన్ని(శానిటైగర్) తాగమని ఒత్తిడి చేసేవారు. వారంతా కలిసి తమను శివుడు, శక్తి అని పిలుస్తూ నరబలి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడంతో పిల్లలిద్దరూ ఫ్రిబవరి 23న తాత, అవ్వ ఇంటికి చేరుకున్నారు. వారిని కూడా బెదిరింపులకు గురిచేయడంతో తాత, అవ్వతో కలిసి జిల్లా ఎస్పీ తంగదురైకి మంగళవారం ఫిర్యాదు చేశారు. పిల్లల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే.. కన్నతల్లిదండ్రులే పిల్లను హత్య చేసేవారని తాత చెప్పాడు.