మైనర్‌పై అత్యాచారంతో ఆగ్రహించిన గుంపు.. దుకాణాలు ధ్వంసం, వాహనాలకు నిప్పు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగగా, ఆగ్రహించిన గుంపు వాహనాలకు నిప్పు పెట్టారు.

By అంజి  Published on  30 Aug 2024 10:56 AM IST
Minor raped in Ghaziabad, vandalises shops, sets vehicles ablaze, Crime

మైనర్‌పై అత్యాచారంతో ఆగ్రహించిన గుంపు.. దుకాణాల ధ్వంసం, వాహనాలకు నిప్పు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. ఈ ఘటనతో గురువారం ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగగా, ఆగ్రహించిన గుంపు వాహనాలకు నిప్పు పెట్టారు. మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లింక్ రోడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్న నిందితుడు బాలిక ఇంటి వెనుక తలుపు ద్వారా చొరబడి ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆపై తన సహచరుల సహాయంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలికను నిందితులు కొట్టినట్లు సమాచారం. ఒకరి కంటే ఎక్కువ మంది ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపించారు. ఒక్క నిందితుడిని మాత్రమే అరెస్టు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానికులు గురువారం నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఆ ప్రాంతంలో నిలిపి ఉంచిన దుకాణాలను, పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు లింక్ రోడ్ పోలీస్ స్టేషన్ వెలుపల గుమిగూడి, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నేరస్తులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు.

Next Story