పబ్‌జీ ఆడేందుకు ఫోన్‌ ఇవ్వలేదని 18 ఏళ్ల స్నేహితుడిని హత్య చేసిన 14 ఏళ్ల బాలుడు

Minor Kills friend for not giving him phone to play PUBG.. రాజస్థాన్‌: పబ్‌ జీ గేమ్‌ ప్రాణాల మీదకు తెచ్చిపెడుతోంది.

By సుభాష్  Published on  18 Nov 2020 9:49 AM IST
పబ్‌జీ ఆడేందుకు ఫోన్‌ ఇవ్వలేదని 18 ఏళ్ల స్నేహితుడిని హత్య చేసిన 14 ఏళ్ల బాలుడు

రాజస్థాన్‌: పబ్‌ జీ గేమ్‌ ప్రాణాల మీదకు తెచ్చిపెడుతోంది. ఇప్పటి పబ్‌జీ గేమ్‌ వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ గేమ్‌ పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. పబ్‌జీ ఆట ఒకరి ప్రాణాలు తీసింది. పబ్‌జీ ఆడడానికి తన స్నేహితుడు ఫోన్‌ ఇవ్వలేదన్న కోపంతో ఒక బాలుడు అతనిని కొట్టి చంపేశాడు. రాజ్‌ సమంద్‌ జిల్లా జైత్‌పురకు చెందిన 14 ఏళ్ల బాలుడు, అతని మిత్రుడు హమీద్‌ (18)కి పబ్‌జీ గేమ్‌ అంటే ఎంతో పిచ్చి. హమీద్‌ ఫోన్‌లో ఆ గేమ్‌ ఉండటంతో ఇద్దరూ తరచూ ఆడేవారు. ఈనెల 9న హమీద్‌ పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని హమీద్‌ తండ్రి భీమ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు హమీద్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 11న రాజ్‌సమండ్‌ సమీపంలోని భేర్‌వాలీ హిల్ ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో పడివున్న హమీద్‌ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత 48 గంటల్లోనే కేసును ఛేదించినట్లు స్టేషన్ హౌస్‌ ఆఫీసర్‌ గజేంద్రసింగ్‌ రాథోడ్‌ తెలిపారు.

అయితే విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి. పబ్‌జీ ఆడడానికి ఫోన్‌ ఇవ్వలేదన్న కోపంతో అతని స్నేహితుడే బండరాయితో బాది హమీద్‌ను హత్య చేసినట్లు తేలింది. పబ్‌జీ గేమ్‌ ఆడేందుకు ఫోన్‌ ఇవ్వమని బాలుడు అడిగితే ఇచ్చేందుకకు హమీద్‌ నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన బాలుడు బండరాయితో హమీద్‌ను మోదడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story