ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా? ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం.. గవర్నర్, సీఎంకు బాలికల లేఖ
Minor girls lodge complaint against their father 5 accused held.ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలపై
By తోట వంశీ కుమార్ Published on 21 May 2022 12:38 PM ISTఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. బయటి వారి నుంచే కాకుండా ఇంట్లో వారి నుంచి కూడా మహిళలలకు రక్షణలేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు వావి, వరుసలు మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే ఇద్దరు కూతుళ్లపై మరో వ్యక్తితో కలిసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలికలు తమపై జరుగుతున్న అకృత్యాలను తెలియజేస్తూ సీఎం, గవర్నర్‌లకు లేఖ రాయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బక్సర్ జిల్లా రాజ్పుర్ తాలుకాలో 16,14 ఏళ్ల బాలికలు తమ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి తండ్రి ఓ నకిలీ వైద్యుడు. విటమిన్ మాత్రలు అని చెప్పి బాలికలను నిద్రమాత్రలు ఇచ్చేశాడు. అనంతరం తన స్నేహితుడైన ఓ తాంత్రికుడితో బాలికలపై అత్యాచారం చేయించే వాడు. కొద్దిరోజులకు అతడు సైతం కుమారైలపై అఘాయిత్యానికి పాల్పడుతుండేవాడు. బాధిత బాలికలు తండ్రిని ఎదిరిస్తే తీవ్రంగా కొట్టేవాడు.
రోజు రోజుకు వేదింపులు తీవ్రం అవుతుండడంతో బాధిత బాలికలు ఇంటి నుంచి పారిపోయారు. బక్సర్‌లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకోని ఉంటున్నారు. ఈ క్రమంలో తాము అనుభవించిన బాధలను తెలియజేస్తూ.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, సీఎం లకు లేఖలు రాశారు. తమ తల్లి,అత్త ప్రోద్భలంతోనే తండ్రిని తమ ఇద్దరిని వేదించాడని బాలికలు తెలిపారు.
బాలికల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాలికల తండ్రి, తల్లి, అత్త, తాంత్రికుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు బక్సర్ ఎస్పీ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.కుమారుడు జన్మించాలనే ఆశతోనే ఇదంతా చేసినట్లు తెలిపారు.