రైల్వేస్టేషన్‌లో ఆరేళ్ల బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి హత్య!

రైల్వే స్టేషన్‌లో బుధవారం ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో కలకలం రేపింది.

By అంజి
Published on : 4 July 2024 10:44 AM IST

Minor girl, Bengaluru, railway station, murder suspected, Crime

రైల్వేస్టేషన్‌లో ఆరేళ్ల బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి హత్య!

బెంగళూరు రైల్వే స్టేషన్‌లో బుధవారం ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో కలకలం రేపింది. పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌ ఆవరణలోని ప్లాట్‌ఫారమ్‌కు సమీపంలో పార్కింగ్‌ స్థలం సమీపంలో పార్కింగ్‌ సిబ్బందికి బాలిక మృతదేహం కనిపించింది.

బాలిక శరీరమంతా గీతలు పడగా, ఆమె బట్టలు రక్తపు మరకలతో కనిపించాయి. బాధిత బాలిక రోజువారీ కూలీ పని చేసే దంపతుల కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. అత్యాచారం చేసిన తర్వాత మృతదేహాన్ని పార్కింగ్‌లో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అయితే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందా లేక ఒకే వ్యక్తి చేసిన నేరమా అన్నది ఇంకా తేలలేదు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు రైల్వే సూపరింటెండెంట్ సౌమ్యలత తెలిపారు. బాలికను మొదట హత్య చేసి, ఆపై మృతదేహాన్ని ఇక్కడ పడవేసినట్లు ఆమె తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story