లిఫ్ట్‌లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఏసీ రిపేర్ చేసేందుకు వచ్చి..
Minor girl sexually assaulted by a 19 years old man in Maharastra. ఏసీ రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడు ఐదేళ్ల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.
By అంజి Published on 9 Dec 2022 9:32 AM GMTఏసీ రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడు ఐదేళ్ల చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. గురువారం నాడు లిఫ్ట్‌లో ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో గల నవీ ముంబై ప్రాంతంలో జరిగింది. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఆజాద్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు శుక్రవారం తెలిపాయి. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లతో పాటు, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తలోజా పోలీస్‌స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర సోనావానే వెల్లడించారు. ''రాయ్‌ఘడ్ జిల్లాలోని తలోజాలో మహ్మద్ అక్తర్ మాథర్ హుస్సేన్‌గా గుర్తించబడిన 19 ఏళ్ల వ్యక్తి 5 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆడుకుంటుండగా నిందితుడు బాధితురాలిని ఎత్తుకెళ్లి లిఫ్ట్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు ఏసీ మెకానిక్. సమీపంలోని ఫ్లాట్ ఏసీ రిపేర్ చేసేందుకు వచ్చాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో బాలికను లిఫ్ట్‌లో పైకి తీసుకెళ్లి బాలికపై బలవంతంగా అత్యాచారం చేశాడు. లిఫ్ట్‌లోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు." అని చెప్పారు.
"బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. ఆమె తల్లి అడిగినప్పుడు.. ఆమె ఈ సంఘటనను వెల్లడించింది. ఆమె తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు భవనం వెలుపల గుమిగూడారు. బాధితురాలు అతనిని గుర్తించిన తర్వాత నిందితుడు తప్పించుకునేలోపు చివరికి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు" అని సోనావానే చెప్పారు. నిందితుడిపై ఐపీసీ, పోక్సో సెక్షన్లు 8, 376 కింద కేసు నమోదు చేయబడింది, అతన్ని అరెస్టు చేశారు అని చెప్పారు. ప్రస్తుతం బాధిత బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్ తెలిపారు.