Kadapa: పెట్రోల్‌ దాడికి గురైన మైనర్‌ బాలిక మృతి

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేల్ శివారులో మైనర్ బాలికపై జె విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

By అంజి
Published on : 20 Oct 2024 6:30 AM

Minor girl, Andhra Pradesh, married man, love affair

Kadapa: పెట్రోల్‌ దాడికి గురైన మైనర్‌ బాలిక మృతి

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేల్ శివారులో మైనర్ బాలికపై జె విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే విఘ్నేష్‌.. తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని బాలిక తెలిపింది.

“శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో విఘ్నేష్ ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో.. మైనర్ బాలిక కడప రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. బాలిక ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాలిన గాయాలతో మరణించింది” అని మైదుకూరు సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విఘ్నేష్, మైనర్ బాలికకు గతంలో సంబంధం ఉంది. అయితే విఘ్నేష్‌ మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం గర్భిణి. మైనర్ బాలికకు ఆరు నెలల క్రితం విఘ్నేష్‌తో పరిచయం ఏర్పడింది. తనను వివాహం చేసుకోవాలని కోరింది. ఆమె డిమాండ్‌తో విసిగిపోయిన విఘ్నేష్ ఈ విపరీతమైన చర్యకు పాల్పడ్డాడు. విఘ్నేష్‌పై బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story