ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. మైనర్‌ బాలికను వ్యభిచార గృహానికి అమ్మేందుకు ప్రయత్నం

Minor girl rescued herself by dialing 100 after a man tries to sell her to a brothel. గుంటూరు జిల్లాలో మైనర్ బాలికను ప్రేమ నెపంతో ట్రాప్ చేసి వ్యభిచార గృహానికి విక్రయించేందుకు ప్రయత్నించిన

By అంజి  Published on  2 March 2022 7:37 AM GMT
ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. మైనర్‌ బాలికను వ్యభిచార గృహానికి అమ్మేందుకు ప్రయత్నం

గుంటూరు జిల్లాలో మైనర్ బాలికను ప్రేమ నెపంతో ట్రాప్ చేసి వ్యభిచార గృహానికి విక్రయించేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి డీఎస్పీ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్టకు చెందిన కంసాని రాజేష్ గుంటూరు జిల్లా మంగళగిరి కొత్తపేటలో నివసిస్తున్నాడు. రాజేష్‌కు వివాహమైంది. కాగా మంగళగిరిలోని పార్క్ రోడ్డులో ఓ అమ్మాయికి రాజేష్ ప్రేమ పేరుతో వల వేశాడు. గత నెల 22వ తేదీ రాత్రి రాజేష్ తన బంధువులు అవినాష్, వినోద్ సహకారంతో బాలికను ఆటోలో యాదగిరిగుట్టకు తీసుకెళ్లి లాడ్జిలో ఉంచాడు.

అక్కడే మద్యం తాగించి అవినాష్ బాలికను లొంగదీసుకున్నాడు. రాజేష్ బంధువు సిరి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తుండడంతో బాధితురాలిని అక్కడికి పంపించాలని భావించాడు. ఇది గ్రహించిన యువతి తప్పించుకుని డయల్ 100కి ఫోన్ చేయగా, పోలీసులు వెంటనే బృందాలుగా ఏర్పడి రాజేష్, అవినాష్, వినోద్, సిరిలను అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. బాలిక అదృశ్యమైన రోజు మంగళగిరిలో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డు ప్రకటించారు.

Next Story
Share it