మంచిర్యాలలో దారుణం.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వరుసకు అన్నయ్యే
Minor girl molested by two boys in Mancherial district.ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 3 Sept 2022 9:13 AM ISTఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి.. తన స్నేహితుడితో కలిసి మూడేళ్ల బాలుడి ముందే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో కూడా తీశారు. మూడు నెలల క్రితం ఈ దారుణ ఘటన మంచిర్యాలి జిల్లాలో జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నెన్నెల మండలంలో ఓ మైనర్(14) బాలిక తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. బాలికకు వరుసకు సోదరుడు అయ్యే ఓ వ్యక్తి కూడా నాలుగు నెలల నుంచి వారి ఇంట్లోనే ఉంటూ ఆటో నడుపుతున్నాడు. కాగా.. మూడు నెలల క్రితం మంచి నీరు తీసుకువద్దామని బాలికతో పాటు మూడేళ్ల బాలుడిని ఆటోలో బోరింగ్ పంపు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడకు మరో యువకుడు వచ్చాడు. నలుగురు ఆటోలో గ్రామ శివారులోని శ్మశాన వాటిక వద్దకు వెళ్లారు.
మూడేళ్ల బాలుడిని ముందు సీటులో కూర్చోబెట్టి.. ఆటో వెనుక సీటులో కూర్చున్న మైనర్ బాలికపై ఒకరి తరువాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని వీడియో కూడా తీశారు. సదరు వీడియోను వారు తమ స్నేహితులకు కూడా పంపించారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో బాలిక బయపడిపోయింది.
తనలోనే తానే మదనపడసాగింది. రెండు రోజుల క్రితం జరిగిన విషయాన్ని మొత్తం అమ్మమ్మకు చెప్పంది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.