దారుణం.. మైన‌ర్ బాలిక‌పై తండ్రి స్నేహితుల అత్యాచారం

Minor girl Molested by father friends in Kerala.మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2022 1:58 AM GMT
దారుణం.. మైన‌ర్ బాలిక‌పై తండ్రి స్నేహితుల అత్యాచారం

మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. తెలిసిన వారే అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతుండ‌డంతో బాధితులు త‌మ బాధ‌ను ఎవ్వ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. తండ్రి స్నేహితులే మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. త్రిసూర్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక 12వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. సోమ‌వారం పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన ఓ కౌన్సెలింగ్‌లో త‌న పై జ‌రిగిన అఘాయిత్యాన్ని వెల్ల‌డించింది. నిందితులంతా త‌న తండ్రి స్నేహితులేన‌ని చెప్పింది. స్పందించిన యాజ‌మాన్యం వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఒక‌రిని అదుపులోకి తీసుకోగా.. మ‌రో ఇద్ద‌రు నిందితుల కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు.

బాలిక తొలుత ఈ విష‌యాన్ని త‌ల్లితో చెప్ప‌గా నిందితుల‌ను ఎదుర్కొనే శ‌క్తి లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌లేదు. కాగా.. బాలిక తండ్రి మాద‌క ద్ర‌వ్యాల వ్యాపారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ముగ్గురు త‌ర‌చూ ఇంటికి వ‌స్తూ.. బాలిక‌పై ప‌లు మార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. వైద్య పరీక్షల్లో దాడి జరిగినట్లు నిర్ధారించామని, బాలికను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తల్లిదండ్రులను సమగ్రంగా విచారించిన తర్వాత వారిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర శిశు సంక్షేమ క‌మిష‌న్ స్పందించింది. పోలీసుల నుంచి నివేదిక‌ను కోరింది.

Next Story