కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి.. మైన‌ర్ బాలిక కిడ్నాప్‌

Minor girl kidnapped and forced to marry drug addict.మాదకద్రవ్యాలకు బానిసైన తన సోదరుడితో వివాహం కోసం ఒక మహిళ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 9:23 AM GMT
కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి.. మైన‌ర్ బాలిక కిడ్నాప్‌

మాదకద్రవ్యాలకు బానిసైన తన సోదరుడితో వివాహం కోసం ఒక మహిళ 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసింది. ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్ కు పాల్పడ్డ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బాలికను టార్గెట్‌గా గుర్తించి కిడ్నాప్ చేసింది. నిందితులను రంజన్ కుమార్, దిలీప్ కుమార్, జ్యోతిగా గుర్తించినట్లు సౌత్ ఈస్ట్ ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్ సురేంద్ర చౌదరి తెలిపారు. ఒక మైనర్ బాలిక విముక్తి కలిగించి.. ఆమె కుటుంబంతో తిరిగి చేర్చారు. నిందితులలో ఒకరితో బాలిక వివాహాన్ని కూడా చేసారని పోలీసులు తెలిపారు.

ఆగస్టు 2021లో, 15 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు సంబంధించి కల్కాజీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబం వాస్తవానికి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందింది. బాలికను సంగం విహార్‌కు తరలించిన కిడ్నాపర్ల గురించి క్లూ పొందడానికి పోలీసు బృందం చాలా సిసిటివి కెమెరాలను స్కాన్ చేసింది, అయితే ఆ తర్వాత ఎటువంటి పురోగతి లేదు. జనవరిలో పోలీసులతో నిత్యం టచ్‌లో ఉన్న తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి, టిగ్రీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఉన్నానని తమ కుమార్తె నుండి తమకు కాల్ వచ్చిందని సమాచారం అందించారు.

వెంటనే పోలీసులు కాల్ చేసిన మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేశారు. ఫోన్ చివరి లొకేషన్‌ను విశ్లేషించగా, సి బ్లాక్, టిగ్రీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ తర్వాత, బాధిత బాలికను కనుగొనడంలో పోలీసు బృందం ఎట్టకేలకు విజయం సాధించింది. బాలికను నిందితులు బందీగా ఉంచారు. బాలికను రక్షించి నిందితులని అరెస్టు చేశారు.

జ్యోతి మొదట బాలికతో కొత్త బట్టలు కొనిస్తానని చెప్పింది. అందుకు అమాయక మైనర్ బాలిక అంగీకరించింది.అలా ఆమెను ఆటోలో ఎక్కించుకున్నారు. బాలికకి మాదకద్రవ్యాలకు బానిసైన జ్యోతి సోదరుడు రంజన్ కుమార్‌తో వివాహం జరిపించాలని బలవంతం చేశారు. ఆమెను మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా, ఇంటి నుండి బయటకు వెళ్లనివ్వకుండా చేశారు. అవకాశం దొరకగానే ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. దీంతో బాధితురాలిని పోలీసులు రక్షించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది

Next Story
Share it