మైన‌ర్ బాలికపై 8 నెలలుగా గ్యాంగ్‌ రేప్‌.. పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు..!

Minor girl gang raped for 8 months in MP.మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై

By అంజి  Published on  28 Sept 2021 9:53 AM IST
మైన‌ర్ బాలికపై 8 నెలలుగా గ్యాంగ్‌ రేప్‌.. పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు..!

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై ఏకంగా 8 నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు ఐదుగురు దుర్మార్గులు. దీంతో బాలిక గర్భం దాల్చి శిశుకు జన్మ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లి మూడేళ్ల క్రితమే చనిపోయింది. తండ్రి ఉపాధి పని కోసం అప్పుడప్పుడు వలస వెళ్లి వస్తుంటాడు. ఈ సమయంలో బాలిక ఇంటి దగ్గర ఒంటరిగానే ఉంటున్న విషయాన్ని గమనించిన ఆమె కజిన్‌.. రోజు ఇంటికి వస్తూ వెళ్లేవాడు. ఇదే అదనుగా భావించిన నిందితుడు బాలికపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూ ఉండేవాడు. నిందితుడితో పాటు మరో నలుగురు స్నేహితులు బాలికపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న నిందితులు గర్భం పొగొట్టేందుకు బాలికకు రకరకాల ట్యాబ్లెట్లు వేశారు. ట్యాబ్లెట్ల ప్రభావంతో బాలిక తీవ్ర గర్భస్రావానికి గురై శిశువుకు జన్మనిచ్చింది. దీంతో విషయం బయట పొక్కకుండా ఉండేందుకు బాలిక, ప్రధాని నిందితుడై ఆమె కజిన్ కలిసి పసికందును బావిలో పడేశారు.

కాగా రెండ్రోజుల క్రితం బావిలో ఆడశిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసికందును హత్య చేసినందుకు గాను బాలిక పై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో సమయంలో ఆ మైనర్‌ బాలిక విస్తూపోయే నిజాలు చెప్పింది. గతేడాది అక్టోబర్ నుండి ఈ ఏడాది మే వరకు 21 ఏళ్ల తన కజిన్‌, అతని నలుగురు స్నేహితులు కలిసి తరచూ అత్యాచారాని పాల్పడ్డారని, బయట ఎవరికి చెప్పొద్దంటూ బెదిరించారని తెలిపింది. కాగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితులపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు మైన్లర్లు ఉన్నారని అశోక్‌ నగర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ రఘువంశ్ భదోరియా తెలిపారు. మైనర్‌ నిందితులను జువైనల్‌ హోమ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Next Story