మొబైల్‌ ఫోన్‌ ఇస్తానని చెప్పి.. మైనర్‌పై సామూహిక అత్యాచారం

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. బుధవారం ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By అంజి  Published on  10 March 2023 9:55 AM IST
Karnataka, Minor girl

మొబైల్‌ ఫోన్‌ ఇస్తానని చెప్పి.. మైనర్‌పై సామూహిక అత్యాచారం

కర్ణాటకలోని హుబ్బళ్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. బుధవారం ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ షాకింగ్ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు 17 ఏళ్ల బాధితురాలికి మొబైల్‌ ఫోన్‌ ఇప్పిస్తానని నమ్మించి.. స్వగ్రామం నుంచి హుబ్బళ్లి పిలిపించాడు. ఆమెను నగరంలోని నెహ్రూ స్టేడియంకు పిలిపించుకున్నాడు. బాధితురాలి స్నేహితురాలి ద్వారా అతడు స్నేహితుడయ్యాడు. అనంతరం మరో స్నేహితుడితో కలిసి ప్రధాన నిందితుడు ఆమెను గోకుల్ రోడ్డులోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి భోజనం పెట్టాడు.

ఆపై వారు బాలికను గడగ్ రోడ్డుకు తీసుకెళ్లి బెదిరించి అత్యాచారం చేశారని ఓ అధికారి తెలిపారు. నిందితులు మరో ఇద్దరు స్నేహితులను సంఘటనా స్థలానికి పిలిచి ఆమెపై అత్యాచారం చేశారు. నిందితులు 22 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులను గోకుల్ రోడ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Next Story