Telangana: బాలికపై సామూహిక అత్యాచారం.. తీవ్ర గాయాలతో మృతి
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల భవన నిర్మాణ మహిళా కూలీపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 18 Aug 2023 9:00 AM ISTTelangana: బాలికపై సామూహిక అత్యాచారం.. తీవ్ర గాయాలతో మృతి
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల భవన నిర్మాణ మహిళా కూలీపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటన ఆగస్టు 14న జరిగినట్లు సమాచారం. అయితే గురువారం వెలుగులోకి వచ్చింది. బాలిక తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌కు వెళుతుండగా తీవ్ర గాయాల కారణంగా మృతి చెందింది. ఆమె పెద్దపల్లి పట్టణ సమీపంలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందిన బాలిక తన సోదరి కుటుంబంతో కలిసి పెద్దపల్లికి వలస వచ్చింది.
ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఇటుక బట్టీలో పని చేయడానికి తెలంగాణకు వలస వచ్చింది. రెండు రోజుల క్రితం పెద్దపల్లి శివారులో బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు ఆమెను మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా, బాధితురాలు పెద్దపల్లి శివారులో మృతి చెందింది. బాలిక సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. విచారణ కోసం పోలీసు బృందాన్ని మధ్యప్రదేశ్‌కు పంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.