ఆమెకు 20.. అతడికి 17.. నెలరోజులుగా సహజీవనం
Minor boy Suicide in banjara hills.అతడు ఇంకా మైనరే. తన కంటే మూడేళ్లు పెద్దదైన యువతిని ప్రేమించాడు. ఆ యువతితో
By తోట వంశీ కుమార్ Published on 30 May 2021 8:03 AM ISTఅతడు ఇంకా మైనరే. తన కంటే మూడేళ్లు పెద్దదైన యువతిని ప్రేమించాడు. ఆ యువతితో సహజీవనం చేస్తూ వారం క్రితం పెళ్లి చేసుకున్నాడు. గత రెండు రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. యువకుడు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యూసుఫ్‌గూడ సమీపలలోని యాదగిరినగర్‌లో బాలాజీ(17) అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ఓ యువతి(20) నివసిస్తోంది. ఆమె సినిమా పరిశ్రమలో పనిచేస్తోంది. వారిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో జవహర్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఆ గదిలోనే పెళ్లి చేసుకున్నారు. గత రెండు రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శనివారం తెల్లవారుజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ మేరకు బాలాజీ ఫ్యాన్‌కు ఉరేసుకొగా యువతి చున్నీతో మెడకు బిగించుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. యువతి చున్నీ ఊడిపోవడంతో కింద పడిపోయింది. వెంటనే ఆ యువతి చుట్టు ప్రక్కల ఉన్నవారిని తీసుకొచ్చే సరికే.. ఆ యువకుడి ప్రాణాలు పోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.