మెడికల్ కాలేజీ వార్డ్ బాయ్ ఆత్మహత్య.. 'ఐ లవ్‌ యూ' నోట్‌ రాసి..

ఉత్తరప్రదేశ్‌లోని ఎస్‌ఎన్‌ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 32 ఏళ్ల వార్డ్ బాయ్ ఆగ్రాలోని తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  10 Oct 2024 7:11 AM IST
Medical college, ward boy,suicide, Agra, Crime

మెడికల్ కాలేజీ వార్డ్ బాయ్ ఆత్మహత్య.. 'ఐ లవ్‌ యూ' నోట్‌ రాసి.. 

ఉత్తరప్రదేశ్‌లోని ఎస్‌ఎన్‌ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 32 ఏళ్ల వార్డ్ బాయ్ ఆగ్రాలోని తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు.. తన భార్యను నిందిస్తూ భర్త ఫోన్‌లో వీడియోను వదిలాడు. వీడియోలో తన అత్తగారిని, బావమరిదిని కూడా తప్పుపట్టాడు. 32 ఏళ్ల వ్యక్తి తన భార్య కోసం సూసైడ్ నోట్‌తో పాటు 'ఐ లవ్ యూ' నోట్‌ను కూడా వదిలిపెట్టాడు. ఇద్దరు గొడవ పడడంతో ఆ వ్యక్తి భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తిరిగి రావడానికి నిరాకరించిందని సోర్సెస్ తెలిపాయి.

అజిత్ సింగ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అజిత్ సింగ్ భార్య అంజలి దేవి, ఆమె తల్లి సునీతా దేవి, తండ్రి హకీమ్ సింగ్, సోదరుడు అన్షులపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు మోపినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2016లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని, అయితే ఒక సంవత్సరం తర్వాత విడివిడిగా జీవించడం ప్రారంభించారని అజిత్ సింగ్ కుటుంబం తెలిపింది. అంతేకాకుండా, తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని భావించిన అజిత్ ఆమె ఫోన్‌ను తన కస్టడీలోకి తీసుకున్నాడు.

అంజలి తన భర్తపై కూడా కేసు పెట్టింది, దాని తర్వాత ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జీవించడం ప్రారంభించింది. ఆమెను శాంతింపజేయడానికి వెళ్లిన అజిత్ తన భార్య, ఆమె కుటుంబ సభ్యులచే అవమానించబడిన తరువాత తీవ్ర చర్య తీసుకున్నాడు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసు అధికారి తెలిపారు.

Next Story