మూడు నెలలు అవుతోంది.. ఆచూకీ కనుక్కోండి

జూలై 1, 2024న అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు.

By Kalasani Durgapraveen  Published on  26 Oct 2024 9:19 AM GMT
మూడు నెలలు అవుతోంది.. ఆచూకీ కనుక్కోండి

జూలై 1, 2024న అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు. కార్వాన్ నియోజకవర్గం నుంచి తప్పిపోయిన పద్నాలుగేళ్ల బాలిక మెహ్రాజ్ ఫాతిమా జాడ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మజీస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ డిమాండ్ చేశారు. ఫాతిమా కనిపించకుండా పోయి 115 రోజులు కావస్తోందని, ఈ కేసులో స్థానిక పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని అంటున్నారు.

జూలై 1, 2024న గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ మాత్రమే దాఖలు చేశారని తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, టోలీచౌకిలోని అక్బర్‌పురా ప్రాంతంలో నివాసం ఉంటున్న సయ్యద్ జాఫర్ భార్య సమ్రీన్ బేగం (33) పెద్ద కుమార్తె ఫాతిమా. గోల్కొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఫాతిమా 5.6 అడుగుల పొడవు, తెల్లని రంగు ఉంది. మిస్ అయినప్పుడు నీలం రంగు పువ్వులు, నీలం ప్యాంటు ధరించి ఉంది. సమ్రీన్ బేగం తాను ఆసుపత్రికి వెళ్లానని, అప్పటి నుండి ఫాతిమా కనిపించకుండా పోయిందని పోలీసులకు తెలిపింది. గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 137 ప్రకారం కేసు నమోదైంది.


Next Story