ఫంక్షన్‌కు వెళ్లారు.. తిరిగొచ్చేస‌రికి ఇల్లు గుల్ల..!

తాళం వేసి ఉన్న ఇళ్ల‌ను మాత్రమే టార్గెట్‌ చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు దొంగ‌లు.

By Kalasani Durgapraveen  Published on  26 Nov 2024 1:49 PM IST
ఫంక్షన్‌కు వెళ్లారు.. తిరిగొచ్చేస‌రికి ఇల్లు గుల్ల..!

తాళం వేసి ఉన్న ఇళ్ల‌ను మాత్రమే టార్గెట్‌ చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు దొంగ‌లు. మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లోని పింగిలి అపార్ట్మెంట్ 101 ఫ్లాట్‌లో ఉండే ఓ కుటుంబం నిన్న రాత్రి సమయంలో ఫంక్షన్ కి వెళ్లారు. ఫంక్షన్ పూర్తి అయి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపుల తాళం పగలగొట్టి ఉంది. దీంతో దొంగలు పడ్డట్లుగా గుర్తించి లోపలికి వెళ్లి బీరువా తెరిచి చూసిన ఇంటి యజమాని ఒక్క సారిగా షాక్ గురయ్యారు. ఇంట్లో ఉన్న 15 లక్షలు నగదు, 12 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ టీవీ దృశ్యాల‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story