కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం..

Massive fire breaks out at chemical factory.జ‌మ్మూకాశ్మీర్‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2021 2:05 AM GMT
chemical factory fire accident

జ‌మ్మూకాశ్మీర్‌లోని ఓ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. క‌శ్మీర్ లోని ఉదంపూర్‌లో ఉన్న కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో గురువారం అర్థ‌రాత్రి త‌రువాత మంట‌లు అంటుకున్నాయి. కెమిక‌ల్ క‌ర్మాగారం కావ‌డంతో మంట‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌టనా స్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను ఆర్ప‌డానికి య‌త్నిస్తున్నారు.

గ‌త రెండు గంట‌లుగా మంట‌ల‌ను అదుపుచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఐఏఎఫ్ వారంట్ ఆఫీస‌ర్ ద‌ల్బీర్ ఎస్ బేహ‌ల్ చెప్పారు. మంట‌ల‌ను అర్ప‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని వెల్ల‌డించారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కారణాలు ఇంకా తెలియ‌రాలేదన్నారు. ఈ ప్ర‌మాదంలో భారీ ఆస్తి న‌ష్టం జ‌రిగిందని వెల్ల‌డించారు.


Next Story
Share it