ప్రేమపెళ్లి.. ఏడాది కూడా కాకుండానే..
Married women suicide in Hyderabad.ఒకే కాలేజిలో చదువుకున్న వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి
By తోట వంశీ కుమార్ Published on 13 Sept 2021 8:38 AM ISTఒకే కాలేజిలో చదువుకున్న వారిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. అయితే.. పెళ్లై ఏడాది కూడా కాకుండానే వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేదిస్తుండడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన మల్లారెడ్డి కుమార్తె పావని(22) పటాన్‌చెరులో ఓ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ పూర్తి చేసింది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన శ్రావణ్ కూడా అదే కాలేజీలో చదవుకున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఏడాది క్రితం ఇద్దరు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. మియాపూర్‌లో ఉంటున్నారు.
కాగా.. గత కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం భర్త శ్రవణ్‌తో పాటు అత్తమామలు వేదిస్తున్నారు. రోజురోజుకు వీరి వేదింపులు ఎక్కువ కావడంతో పావని కుంగిపోయింది. శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి చేతిపై భర్త, అత్తమామల అదనపు కటన్నం వేదింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసుకున్నట్లు గుర్తించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.