లావుగా ఉన్నావు.. అందంగా లేవు.. వేరొక వివాహం చేసుకుంటాన‌న్న భ‌ర్త‌

Married woman suicide in Hyderabad.నివ్వు లావుగా ఉన్నావు.. అందంగా లేవు అంటూ భ‌ర్త నిత్యం వేదించేవాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 2:54 AM GMT
లావుగా ఉన్నావు.. అందంగా లేవు.. వేరొక వివాహం చేసుకుంటాన‌న్న భ‌ర్త‌

నివ్వు లావుగా ఉన్నావు.. అందంగా లేవు అంటూ భ‌ర్త నిత్యం వేదించేవాడు అయినా కుమారుడికి కోసం భ‌ర్త వేదింపుల‌ను త‌ట్టుకుంటోంది. అయితే.. ఇటీవ‌ల భ‌ర్త తాను రెండో పెళ్లి చేసుకుంటాన‌ని అంటుండ‌గా.. అత‌డికి అత్తా మామ‌లు సైతం మ‌ద్ద‌తుగా నిలిచారు. రోజు రోజుకి వీరి వేదింపులు తీవ్రం కావ‌డంతో ఆ గృహిణి ఉరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. నారాయణఖేడ్‌కు చెందిన హలీమాబేగం (25) కు బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన అబ్దుల్‌ హాసిఫ్‌ (32) తో 2018 జూన్‌లో వివాహమైంది. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కుమారుడున్నాడు. కాగా.. గ‌త కొద్ది కాలంలా.. హాలీమా బేగం అందంగా లేద‌ని.. లావుగా ఉంద‌ని.. మ‌రో పెళ్లి చేసుకుంటాన‌ని అబ్దుల్ హాసిఫ్ వేదించ‌సాగాడు. అత్త బీబీ ఫాతీమా, మామ అబ్దుల్ జానీమియా సైతం సూటిపోటి మాట‌లు అనేవారు.

ఈ విషయాన్ని హలీమా పుట్టింటి వారి దృష్టికి తీసుకెళ్లింది. అత్తింటి వారితో వారు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో.. విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని, తనను తీసుకెళ్లాలని గురువారం ఉదయం హలీమా తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. ఆ తరువాత ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేసింది. ఫోన్ ఎత్తి మాట్లాడిన తోటికోడలు హలీమాబేగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పింది. వెంట‌నే న‌గ‌రానికి చేరుకున్నారు హాలీమా త‌ల్లిదండ్రులు. త‌మ కుమారూ మ‌ర‌ణానికి భ‌ర్త‌, అత్తామామ వేదింపులే కార‌ణ‌మ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it